నాగ్ స్టేట్మెంట్ ని సీరియస్ గా తీసుకోవాల్సిందే!

నాగ్ స్టేట్మెంట్ ని సీరియస్ గా తీసుకోవాల్సిందే!

Published on Jul 21, 2026 10:13 AM IST

Nagarjuna

అక్కినేని నాగార్జున తన ఇద్దరు నట వారసులు నాగ చైతన్య, అఖిల్ లకి సాలిడ్ హిట్స్ అందించి ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఇక తాను బ్యాలన్స్ ఉన్నారు. ఇలా తన కింగ్ 100వ సినిమాతో బిజీగా ఉన్న తాను లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. ఒకప్పుడు నెల ముందే సినిమా కాపీ రెడీ చేసుకునే రోజులు నుంచి ఇప్పుడు నెలల పాటు సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చామనే ఆత్మ విమర్శ ఇప్పుడు చర్చకు దారి తీసింది.

అయితే ఇది డెఫినెట్ గా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే అని విశ్లేషకులు అంటున్నారు. థియేటర్స్ లో సినిమా కోసం ఆడియెన్స్ ఏదో అకేషనల్ గా వచ్చేటట్టు కాకుండా ఎప్పటికపుడు మన స్టార్ హీరోల సినిమాలు ఆన్ టైం పడితే గాని పరిస్థితులు సెట్ కావు. ఇందుకు సినిమాలు ప్రీప్లాన్డ్ గా పూర్తవ్వాలి.. రిలీజ్ అవ్వాలి కానీ అదే ఇప్పుడు టాలీవుడ్ లో జరగట్లేదు. సో వీటిని మన దర్శకులు, హీరోలు పరిగణలోకి తీసుకొని మళ్ళీ పాత రోజుల్లోలా సినిమాలు విడుదల చేస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు