
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ కాంపెయిన్ లో టాలీవుడ్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున కూడా జాయిన్ అయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నాగార్జునను ఈ కాంపెయిన్ లో పోల్గోనవలసిందిగా నామినేట్ చేశారు. ఆయన ఆహ్వానాన్ని నాగార్జున స్వీకరించారు. తనను నామినేట్ చేసినందుకు అనిల్ అంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘థాంక్ యు అనిల్ అంబానీ, క్లీన్ ఇండియా మూమెంట్ లో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు. నాపై నమ్మకం ఉంచినందుకు. నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను’ అని నాగార్జున ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇదొక గౌరవంగా, పెద్ద భాద్యతగా భావిస్తున్నాను. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంపై వేలాది మంది ప్రజలలో అవగాహన కల్పించడానికి, వారిని ఈ మహా యజ్ఞంలో నిమగ్నం అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తాను. విదేశాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ పరిశుభ్రమైన నగరాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఆ క్లీన్ కంట్రీస్ లిస్టులో ఇండియా చేరడానికి ఇంకెంతో దూరంలో లేదు. ప్రతి ఒక్క పౌరుడు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొంటే త్వరలో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. అని నాగార్జున వ్యాఖ్యానించారు.

