Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : నాగార్జున – దేవా,దాస్ లు ఫుల్ గా నవ్విస్తారు !
Published on Sep 24, 2018 12:39 pm IST

ఆఫీసర్ చిత్రంతో తన అభిమానులను నిరాశ పరిచిన కింగ్ నాగార్జున తాజాగా యువహీరో నాని తో కలిసి దేవదాస్ చిత్రంలో నటించారు. ఈసినిమా ఈనెల 27న విడుదలవుతున్న సంధర్బంగా నాగ్ మీడియా తో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం ..

ఈ సినిమాలో నటించడానికి కారణం ?
ఈసినిమా స్క్రిప్ట్ గురించి ఎప్పుడైతే విన్నానో అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను ఈసినిమాలో నటించాలని అలాగే నాని వున్నాడు కాబట్టి ఈసినిమా ఇంకా హిలేరియస్ గా ఉంటుంది అనుకున్నాను సినిమా కూడా అలాగే వచ్చింది. మా ఇద్దరి కెమిస్ర్టీ సినిమాలో చాలా బాగుంటుంది. ఈచిత్రం మున్నాబాయ్ ఎమ్ బి బి ఎస్ తరహాలో కామెడీ గా సాగుతుంది.

మీ పాత్ర గురించి ?
ఈచిత్రంలో నేను డాన్ పాత్రలో నటించాను అలాగని పూర్తిగా నెగిటివ్ గా ఉండదు. ఒకానొక సంధర్భంలో నేను పేషేంట్ గా డాక్టర్ నాని కలుస్తాను. ఆ తరువాత ఇద్దరం మంచి స్నేహితులం అవుతాం. ఆ తరువాత వారు ఏ రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేదే మిగితా స్టోరీ.

నాని తో నటిచడం ఎలా అనిపిస్తుంది ?
నాకు నాని గురించి వ్యక్తిగతంగా చాలా తక్కువగా తెలుసు. కానీ స్క్రీన్ మీద కానీ సెట్ లో గాని చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. మా ఇద్దరి మధ్య కెమిస్ర్టీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది.

ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలపై ద్రుష్టి పెట్టినట్లుంది ?
నేను ఇప్పుడు నా కున్న వయసులో నేను లీడ్ రోల్ చిత్రాల్లో నటించలేను. నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. అలాగే ఈ మల్టీ స్టారర్ చిత్రాలు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాయి. అందుకే ప్రస్తుతం ధనుష్ తో కలిసి ఒక సినిమాలో అలాగే రణబీర్ కపూర్ తో బ్రహ్మస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నాను.

వైజయంతి మూవీస్ బ్యానర్ తో మీ అనుభందం గురించి ?
నాకు చాలా సంవత్సరాలనుండి వైజయంతి మూవీస్ తో మంచి అనుభందం వుంది. చాలా మంచి సినిమాలు తీశారు. అలాగే మా కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు పెద్ద విజయాలను సాదించాయి. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఈ బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆందంగా వుంది.

ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ చూసి ఏమనుకున్నారు ?
ఆ సినిమాలో సుమంత్ లుక్ చాలా బాగుంది. అచ్చం నాన్న గారిలాగే వున్నాడు. సుమంత్ నాన్న గారి దగ్గరే పెరిగాడు. ఆయనకు సుమంత్ అంటే చాలా ఇష్టం. ఈ విషయంలో క్రిష్ ను అభినందించాల్సిందే. స్క్రీన్ మీద నాన్న గారి పాత్రను చూడాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

నాని మొబైల్ అడిక్షన్ గురించి ఎందుకు స్పెషల్ వీడియో ను తియ్యాలనిపించింది ?

నేను చాలా సార్లు గమనించాను నాని ఎప్పుడు ఫోన్ తోనే బిజీ గా ఉంటాడు. ఆయన కు ఏమైనా జబ్బు ఉందేమో ఎప్పుడు ఫోన్ చూస్తేనే ఉంటాడు అని ఫీల్ అయ్యాను. నాని అనే కాదు మనకు తెలిసి చాలా మంది ఇలాగే వుంటారు. వారు వాళ్ళ చుట్టూ పక్కల ఏం జరిగిన పట్టించుకోరు. వల్ల బిజీలో వారు ఉండిపోతారు.

మీ తదుపరి చిత్రాల గురించి ?

మన్మధుడు 2 స్క్రిప్ట్ రెడీ అవుతుంది., రాహుల్ రవీంద్రన్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈచిత్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఇంకొంచెం సమయం పడుతుంది.

సంబంధిత సమాచారం :