నాగ్ “ది ఘోస్ట్” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి దిగ్గజం!

నాగ్ “ది ఘోస్ట్” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి దిగ్గజం!

Published on Aug 19, 2022 12:30 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ చిత్రం ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం అప్డేట్ లను షురూ చేసింది. ఈ చిత్రం కి సంబంధించిన వీడియో ను లేటెస్ట్ గా విడుదల చేసి, నాగ పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుంది అనే దాని పై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ మరియు టెలివిజన్ హక్కుల పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా దక్కించుకుంది. ఈ చిత్రం లో సోనాల్ చౌహాన్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు