‘బిగ్ బాస్-4’ నుండి నాగార్జున నిజంగానే బ్రేక్ తీసుకుంటారా ?

BiggBoss4 1
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది. ప్రతి వీకెండ్ వీక్షకులు షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడమే పెద్ద రీజన్. ఆయన షోను నడిపిస్తున్న తీరు జనాలకు బాగా నచ్చింది. అందుకే మంచి టీఆర్ఫీలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా నాగ్ షో నుండి బ్రేక్ తీసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తున్నాయి.

ఇందుకు కారణం ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ రీస్టార్ట్ కానుండటం. లాక్ డౌన్ ముందు కులుమానాలి లాంటి ప్రాంతంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ప్లాం చేశారు టీమ్. కానీ లాక్ డౌన్ మూలంగా అది జరగలేదు. మళ్ళీ ఇప్పుడు చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వడంతో ‘వైల్డ్ డాగ్’ టీమ్ షూటింగ్ సన్నాహాలు చేస్తోందట. అక్కడి సైనిక అధికారులు, ప్రభుత్వం నుండి చిత్రీకరణకు అనుమతులు తీసుకున్నారట.

10 రోజుల పాటు ఉందనున్న ఈ షెడ్యూల్లో నాగార్జున మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అందుకే నాగ్ బిగ్ బాస్ షోకు బ్రేక్ ఇవ్వనున్నారని, ఆయన స్థానంలో వేరొక సెలబ్రిటీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని అంటున్నారు. మరి నిజంగానే నాగ్ షోకు బ్రేక్ ఇస్తారో లేకపోతే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని అటు షో, ఇటు సినిమా రెంటినీ చేస్తారో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

Exit mobile version