నాగ్ చేతుల మీదుగా విడుదల కానున్న ట్రైలర్ !
Published on Jul 27, 2018 8:40 pm IST

యువ హీరో సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చి ల సౌ’. ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈచిత్రం ఇప్పటికే ప్రమోషన్స్ ను ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఈ చిత్రంలోని ‘సోలో సోలో’ అనే సాంగ్ ను ఇటీవల అఖిల్ విడుదల చేయగా ఇప్పుడు నాగార్జున కూడా ఈ చిత్రానికి తన వంతు సహాయం చేయనున్నారు.

ఈ చిత్రం యొక్క ట్రైలర్ రేపు ఉదయం 10 గంటలకు నాగ్ చేతులమీదుగా విడుదలకానుంది. ఇక సుశాంత్ ఈసినిమా ఎలాగైనా తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం తో ఉన్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook