‘మనం’ సినిమాలోని ‘పియో పియో రే’ పాటను విడుదల చేసిన నాగార్జున

‘మనం’ సినిమాలోని ‘పియో పియో రే’ పాటను విడుదల చేసిన నాగార్జున

Published on Apr 26, 2014 11:25 AM IST

Manam
స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు, ‘కింగ్’నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. ఈ సినిమాలోని ‘పియో పియో రే’ పాటను నాగార్జున విడుదల చేశారు. క్లబ్ సెట్టింగ్ లో ఉండే ఈ పాటను నాగార్జున, నాగ చైతన్యలపై చిత్రీకరించారు.విశేషం ఏంటి అంటే ఈ పాట ఏఎన్అర్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ప్రేమ్ నగర్’లోని ‘నేను పుట్టాను’ అనే పాటకు రీమిక్స్.

ఎంతో శ్రద్ధతో పాటలు అందిస్తున్న సంగిత దర్శకుడు అనూప్ రుబెన్స్ కి ఇది 25వ సినిమా. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీయ మరియు సమంత హీరొయిన్ లుగా నటిస్తున్నారు. నీతు చంద్ర, రాశి ఖన్నలు కూడా అతిధి పాత్రలో కనబడనున్నారు. ‘మనం’ ఒక ఫీల్ గుడ్ సినిమాలా తెరకెక్కుతుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు