బంగార్రాజుగా ఎంటర్టైన్ చేయనున్న నాగార్జున

బంగార్రాజుగా ఎంటర్టైన్ చేయనున్న నాగార్జున

Published on Mar 21, 2015 9:05 AM IST

nagarjuna

ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న కింగ్ నాగార్జున చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను సుమారు 1500 సంవత్సరాల నాటి గుడిలో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా నాగార్జున చేసిన బాగ్గారాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తుందని ఈ చిత్ర టీం అంటోంది.

ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మార్చి 22 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. ‘హలో బ్రదర్’ తరహాలో పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరదలిగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది. హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత.

తాజా వార్తలు