ప్రారంభమైన అక్కినేని నాగార్జున “బంగార్రాజు” మూవీ షూటింగ్!

Published on Aug 25, 2021 6:00 pm IST


అక్కినేని నాగార్జున మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కలిగి ఉన్న నాగ్ బంగార్రాజు చిత్రం తో ముందుకు వస్తున్నారు. కళ్యాణ్ కురసాల దర్శకత్వం లో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం భారీ విజయం సాధించింది. నాగ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఈ బంగార్రాజు వస్తోంది. ఈ సినిమా లో నాగార్జున కుమారుడు నాగ చైతన్య కీలక పాత్ర లో నటిస్తున్నారు.

నాగ చైతన్య కి జోడీ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి ను హీరోయిన్ గా తీసుకోగా, నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభం అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, యువరాజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అయితే ఈ బంగార్రాజు చిత్రం మొత్తం కూడా రొమాన్స్, ఎమోషన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం గా రానుంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :