ప్రారంభమైన రమ్యకృష్ణ – నాగార్జున – లావణ్య మూవీ

ప్రారంభమైన రమ్యకృష్ణ – నాగార్జున – లావణ్య మూవీ

Published on Nov 19, 2014 10:32 AM IST

nagarjuna
‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున వెండితెరకి కాస్త విరామం ఇచ్చి బుల్లితెరపై బిజీ అయ్యాడు. ఈ గ్యాప్ లో ఆయన బుల్లితెరపై చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మంచి ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2 సిద్దమవుతుండడంతో అయన తిరిగి మళ్ళీ సినిమాలపై దృష్టి సారించాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.

ఈ సినిమా ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా నాటితరం హీరోయిన్ రమ్యకృష్ణ ఒక హీరోయిన్ గా కనిపిస్తుంటే, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి మరో హీరోయిన్ గా కనిపించనుంది. పలువురు ప్రముఖులు సమక్షంలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. రాధా మోహన్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ కి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు