అక్కినేని వీరాభిమాని, అభిమాన సంగం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని నాగార్జున పరామర్శించారు. రవీందర్ రెడ్డి చనిపోయిన రోజు నాగ్ షూటింగ్ నిమ్మిత్తం వేరే చోట ఉండడంతో ఆయనను చూడడానికి రాలేకపోయారు. ఆ సంధర్భంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఇక ఇప్పుడు ఆయన సతీమణి అమలతో కలిసి నిన్నరవీందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన నాగ్ వారి తల్లిదండ్రులను పరామర్శించారు. నాగ్ కెరీర్ ప్రారంభం నుండి రవీందర్ ఆయనకు అభిమానిగా వుంటున్నారు. అక్కినేని వారి ఫ్యామిలీ కి సంభందించిన సినిమాల ఫంక్షన్లు అన్ని ఆయన చేతుల మీదుగానే జరిగేవి.
