టాలీవుడ్ యంగ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”. మరి మంచి బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే హీరో నితిన్ స్వామి మాట్లాడుతూ తమ సినిమా చూసి ఎవరైనా ఫుల్ గా ఎంటర్టైన్ కాలేదు అంటే మీ టికెట్ డబ్బులు ప్రొడ్యూసర్ నాగవంశీ వెనక్కి ఇచ్చేస్తాడు అని..
మా ఇద్దరి మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇదే స్టేట్మెంట్ ని నాగవంశీ గతంలో తమ “మ్యాడ్” సినిమా రిలీజ్ టైం లో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ సినిమా చూసి ఎవరు నవ్వుకోలేదు అంటే చెప్పండి మీ డబ్బులు వెనక్కి ఇస్తాను అనేది వైరల్ గా మారింది.
ఇదే స్టేట్మెంట్ ని నితిన్ చెప్తూ నాగవంశీని ఇరికించడం మంచి ఫన్ గా మారింది. దీనితో నాగవంశీ తన రిప్లై ఇచ్చాడు. ఆరోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం నితిన్ స్వామీ ఇప్పుడు మీరు ఇలా లాక్ చేస్తే ఎలా? అంటూ తానూ ఫన్ రిప్లై సమాధానంగా అందించాడు. దీనితో వీరి ఫన్ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Aa roju #MAD vibe lo ala anesam @actor_nithiin Swamyy … Meeru ila lock chesthe ela ???? https://t.co/0ZgaKdmtvb pic.twitter.com/RNIw07ty1T
— Naga Vamsi (@vamsi84) December 2, 2023


