మరోసారి టి.ఆర్.పి లలో టాప్ పొజిషన్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

మరోసారి టి.ఆర్.పి లలో టాప్ పొజిషన్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

Published on Dec 20, 2014 9:47 PM IST

mek1
నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మొదటి సీజన్ మంచి విజయం సాధించడంతో పునరాలోచన లేకుండా సెకండ్ సీజన్ ని మొదలుపెట్టేసారు. గత రెండు వారాల క్రితం మొదలైన ఈ సెకండ్ సీజన్ మొదటి వెర్షన్ మాదిరిగానే మంచి ఆదరణ పొందుతుంది. రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలలో అత్యధిక టీ.ఆర్.పి లను సొంతం చేసుకుంది

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇతర ప్రముఖ చానళ్ళలో నిర్వహించే షో లను ఘనమైన మార్జిన్ తో నెగ్గుకొచ్చి 6.83 పాయింట్లను సంపాదించుకుంది. నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు, మిడిల్ క్లాస్ వర్గాలను ఆకట్టుకుంటున్న విధానం శుక్రవారం సెలబ్రిటీల రాక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి

తాజా వార్తలు