‘మహేష్ బాబు’ సినిమాలో ‘నమ్రత’ నటిస్తోందా ?

Namrata
‘సూపర్ స్టార్ మహేష్ బాబు’ సతీమణి ‘నమ్రత’ సినిమాల్లో నటించడం మానేసి చాలా రోజులయింది. ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించిన చివరి సినిమా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘అంజి’ చిత్రం. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె ఆ చిత్రం తరువాత పూర్తిగా మహేష్ బాబు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబందించిన పనులను, ఇతర బిజినెస్ వ్యవహారాలను, కుటుంబ వ్యవహారాలు చూసుకోవడంలో బిజీ అయ్యారు.

ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఏమిటంటే నమ్రత మళ్ళీ ఇన్నేళ్ల తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందట. అది కూడా ఆమె భర్త మహేష్ బాబు, దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ద్వారానేనని కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో నమ్రత తక్కువ నిడివి ఉండే పాత్రలో కనిపించనుందట. కానీ ఈ విషయంపై మహేష్ తరపు నుండి గాని, సినిమా వైపు నుండి గాని ఎలాంటి సమాచారమూ ఇంకా తెలియలేదు. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ‘రకుల్ ప్రీత్’ మెయిన్ లీడ్ గా నటిస్తోంది.