హైదరాబాద్ లో ‘ఏఎన్ రెస్టారెంట్’ ని ప్రారంభించిన నమ్రత మహేష్

Published on Dec 8, 2022 2:13 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ నేడు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ని లాంచ్ చేసారు. ప్రముఖ నిర్మాత మరియు ఏషియన్ సంస్థల అధినేత ఏషియన్ సునీల్ తో కలిసి ఆమె ఈ రెస్టారెంట్ ని ఆరంభించడం జరిగింది. పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ తాలూకు వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా గతంలో ఏషియన్ సంస్థలతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు కలిసి ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ ఎందరో ప్రేక్షకాభిమానులు క్రేజ్ తో దూసుకెళుతోంది. అదే విధంగా ప్రస్తుతం ప్రారంభించిన రెస్టారెంట్ కూడా రాబోయే రోజుల్లో ఎంతో వృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి పలువురు అతిథులు బెస్ట్ విషెస్ తెలియచేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :