గౌతమ్ ఆసక్తికర వీడియో పంచుకున్న నమ్రత

Published on Jun 4, 2020 1:03 pm IST

మహేష్ సతీమణి నమ్రత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో భర్త మరియు పిల్లలకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు పంచుకుంటున్నారు. నేడు ఆమె కొన్నేళ్ల క్రితం మహేష్ కొడుకు గౌతమ్ డమ్ షరెడ్స్ ఆడిన ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. గౌతమ్ ఎదో విషయాన్ని నటన ద్వారా తెలియజేస్తుంటే ఎదురుగా ఉన్న పిల్లలు తమ ఊహకు పని పెడుతూ అనేక పేర్లు చెవుతున్నారు.

ఆ వీడియోలో గౌతమ్ దేని గురించి చెవుతున్నాడు అనే విషయం మాత్రం నమ్రత చెప్పలేదు. ఇక నమ్రత ఇలాంటి అనేక త్రో బ్యాక్ వీడియోలు పంచుకోనున్నారు అని తెలుస్తుంది. మరో వైపు మహేష్ తన నూతన చిత్ర ప్రకట చేశారు. పరశురామ్ డైరెక్షన్ లో ఆయన చేయనున్న సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More