విచారం వ్యక్తం చేసిన బాలయ్య !

విచారం వ్యక్తం చేసిన బాలయ్య !

Published on Aug 8, 2018 1:35 PM IST

balakrishna

రాజకీయ చాణక్యుడిగా తమిళ సాహితీ దిగ్గజంగా కళాకారుడిగా రచయితగా పాత్రికేయుడిగా ఇలా కరుణానిధిగారు అందించిన సేవలు అత్యద్భుతం. ఆయనకి తప్ప మరెవరికీ సాధ్యం కానీ విధంగా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకొని ఆయన ఈ లోకం వదిలివెళ్ళిపోయారు. కాగా తాజాగా నందమూరి బాలకృష్ణ కరుణానిధి మరణం పై స్పందించారు.

బాలయ్య మాట్లాడుతూ.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిగారి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు సినీపరిశ్రమకి కూడా తీరని లోటు ఇంకెవ్వరూ పూడ్చలేని లోటు అని తెలిపారు. ఓ రాజకీయ దిగ్గజాన్ని మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయామని అంతటి గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న మహానుభావుడు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు