నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు సాధారణంగా మీడియా ఫోకస్‌కు దూరంగా ఉంటారు. ఆయన పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా లోకేష్‌ను వివాహం చేసుకోగా, చిన్న కుమార్తె తేజస్విని భరత్‌ను పెళ్లాడింది. అయితే, ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే తేజస్విని డాన్స్ చేసిన ఒక చిన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో తేజస్విని ఎనర్జీ, కాన్ఫిడెన్స్ మరియు ఆమె హావభావాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ బయట పెద్దగా డాన్సులు చేస్తూ కనిపించని తేజస్వినిని ఇలా సరికొత్త యాంగిల్‌లో చూసేసరికి, నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఇదొక స్వీట్ సర్ప్రైజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా తేజస్విని సినిమా ఇండస్ట్రీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తెరవెనుక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు, ప్రొడక్షన్ వ్యవహారాల్లో పాలుపంచుకోవడంతో పాటు, మేకింగ్ ప్రాసెస్ నేర్చుకోవడానికి ఇతర చిత్రాల షూటింగ్ సెట్లను కూడా సందర్శిస్తున్నట్లు సమాచారం. ఈ వైరల్ వీడియో కేవలం సరదాగా చేసినదా లేక ఆమె పబ్లిక్ లైమ్‌లైట్‌లోకి రావడానికి ఇష్టపడుతుందా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికైతే ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


