దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగుకు దక్కిన స్థానం 3. తెలుగు భాషలు దక్కే గౌరవం, మర్యాద మాటల్లో చెప్పలేనిది. మనసు పలికే భాష అమ్మభాష. అందుకే దేశ భాషలందుతెలుగు లెస్స అంటారు. ఇపుడు తెలుగు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే… ప్రతి ఏటా తెలుగు మహా సభలు గ్రాండ్ గా చేస్తూ ఉంటారు. ఇది మందరికి తెలిసిన విషయమే.
తాజాగా ఏప్రిల్ 7న ఆస్ట్రేలియాలో జరగబోయే తెలుగు మహా సభలకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా వెల్లబోతున్నాడు. మంచి కార్యక్రమం ఎక్కడ జరిగిన ముందు ఉండే హీరోల్లో బాలయ్య ఒకరు. బిజీ సేడ్యుల్ ఉన్నప్పటికీ తెలుగు వారిని కలుసుకోవడం కోసం బాలయ్య ఈ మహాసభలకు వెళ్తున్నాడు. తాజాగా బాలయ్య కొత్త సినిమా ఎన్టీఆర్ బయోపిక్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.


