నందమూరి హీరో సినిమాకి సింగిల్ షెడ్యూలే !

నందమూరి హీరో సినిమాకి సింగిల్ షెడ్యూలే !

Published on Nov 18, 2018 3:59 AM IST

శివ‌ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకం పై తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నాగ‌రాజు నెక్కంటి నిర్మిస్తున్న చిత్రం `అమృత వ‌ర్షిణి`. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జ‌రిగింది.

కాగా ఇంతకు ముందు శివ‌ ప్ర‌భు క‌న్న‌డ‌లో నాలుగు సినిమాలు చేసి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఈ సినిమా పై బాగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 20న షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం అని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ : స‌భా కుమార్‌; స‌ంగీతం : జెస్సీ గిప్ట్; ఎడిటింగ్ : శివ‌ప్ర‌సాద్ యాద‌వ్; మాట‌లు – స‌హ ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ కుమార్‌; నిర్మాత : నాగ‌రాజు నెక్కంటి; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం : శివ‌ప్ర‌భు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు