రామ్ చరణ్ తో తలపడనున్న నందమూరి హీరో !


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం మార్చి 30వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మెగా అభిమానులు బోలెడు అంచనాలను పెట్టుకున్నారు. ట్రేడ్ విశ్లేషకులు సైతం సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తలపడటానికి సిద్దమవుతున్నాడు.

నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ చరణ్ సినిమాకి కేవలం రెండు రోజుల ముందు రిలీజైతే మాత్రం ‘ఎం.ఎల్.ఏ’ తప్పకుండా గట్టి పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. అంతేగాక ఈ రెండిటి మధ్యలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మహానటి’ రిలీజవుతూ పోటీని మరింత తీవ్రతరం చేయనుంది.