ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ పెద్దకర్మ కార్యక్రమాలు డిసెంబర్ 18వ తేదిన, గురువారం నాడు జరగనున్నాయి. జానకిరామ్ మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కుమారుడి మృతిని హరికృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు సోదరుడిని కోల్పోవడంతో విషాద వదనంతో కనిపిస్తున్నారు.
సినిమా రంగంలో అనేక మందికి జానకిరామ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమ్ముడు కళ్యాణ్ రామ్ హీరోగా ‘అతనొక్కడే’ సినిమాను నిర్మించారు. జానకిరామ్ కు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయికి తాతయ్య గారి పేరు నందమూరి తారక రామారావుని పెట్టారు. కృష్ణుడిగా ‘దానవీర శూర కర్ణ’ అనే బాలల పౌరాణిక సినిమాలో నటిస్తున్నాడు.


