సోషియో ఫాంటసీ కథలో.. ‘అశ్వత్థామ’గా !

Published on Mar 10, 2019 7:55 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కే వి గుహన్ దర్శకత్వంలో ‘118’ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అందించిన విజయానందంతో కళ్యాణ్ రామ్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు.

మల్లిడి వశిష్ట్ అనే దర్శకుడి చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట. కథ నచ్చడంతో తన ఓన్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఈ సినిమాను చెయ్యడానికి అంగీకరించారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి టైటిల్ ‘అశ్వత్థామ’ అని పెట్టారు. మొదట్లో తుగ్లక్ అని టైటిల్ పెట్టాలనుకున్నప్పటికీ.. చివరికి ‘అశ్వత్థామ’కే ఫిక్స్ అయింది చిత్రబృందం.

కాగా ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన ఓ టాప్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. మరి ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక విభాగంకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :