ఎన్టీఆర్ బయోపిక్ లో మరో నందమూరి హీరో !

Published on Aug 28, 2018 10:07 am IST

నందమూరి బాలకృష్ణ’ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా మరో నందమూరి హీరో కూడా నటించనున్నాడు. వివరాల్లోకి వెళ్తే ‘నందమూరి కళ్యాణ్ రామ్’ గతంలోనే ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఐతే ఆ వార్తల పై కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో స్పందిస్తూ దర్శకుడు క్రిష్ ఇంకా నన్ను సంప్రదించలేదని.. దర్శక నిర్మాతలు నుండి పిలుపు వస్తే తనకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చిత్రబృందం నుంచి కళ్యాణ్ రామ్ కు పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో కళ్యాణ్ రామ్ తన తండ్రి ‘హరికృష్ణ’ పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ‘ఎన్టీఆర్ చైతన్య రథానికి’ ‘హరికృష్ణ’ సారధిగా వ్యవహరించారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More