తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నందమూరి వసుంధర

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నందమూరి వసుంధర

Published on Sep 23, 2026 8:00 AM IST

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను కలిశారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మకు వసుంధర అభినందనలు తెలిపారు. శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం వసుంధర కుటుంబ యోగక్షేమాలను శ్రీధర్ వర్మ అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌తో పాటు పలువురు బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు