తండ్రిని తలపించిన బాలయ్య !

Published on Aug 14, 2018 5:35 pm IST

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అందరికీ తెలుసు. మరి ఎన్టీఆర్ గా ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఉన్న లుక్ ఈ సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. కాషాయం దుస్తుల్లో బాలయ్య లుక్ అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండటం విశేషం. ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్ లా హ్యాండ్ పైకి చూపిస్తూ ముఖంలో చిరునవ్వుతో ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చారు.

ఐతే ఎన్టీఆర్ గా బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :

X
More