ఆ లేడీ డైరెక్టర్ కి ప్రభాస్ అంటే క్రష్ అంటా…!

Published on Jun 24, 2019 7:21 am IST

టాలీవుడ్లో లేడీ డైరెక్టర్ గా నందిని రెడ్డి కి సముచిత స్థానం ఉంది. నాని, నిత్యా మీనన్ హీరో హరోయిన్ లుగా మొదటి సినిమా “అలామొదలైంది” తో ఆమె సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో ఆమె దర్శకత్వం వహించిన “ఓ బేబీ” జులై 5 న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను, ఇండస్ట్రీ లోని టాప్ హీరోస్ లో మీ క్రష్ ఎవరు అని అడుగగా, ప్రభాస్ అని చెప్పేశారు. ఆయనంటే మొదట్నుండి నాకు ఇష్టం అని నందిని మీడియా ముఖంగా ప్రభాస్ పై తన ఇష్టాన్ని బయటపెట్టేసారు. మరి ఎప్పుడైనా మీ ఇష్టాన్ని ప్రభాస్ కి తెలియజేసారా, అన్న ప్రశ్నకు లేదు ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మాటలు రావు, సిగ్గేస్తుందని నవ్వేశారు.

సంబంధిత సమాచారం :

X
More