ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక టాలీవుడ్ లో ఈ దశాబ్దానికి గాను తెలుగు చిత్ర పరిశ్రమ దశా దిశా మార్చిన దర్శకులపై ఒక కథనం ప్రచురించింది. ఈ ఆర్టికల్ నందు ప్రముఖంగా వీరు ఐదుగురు దర్శకుల పేర్లు ప్రస్తావించగా వారిలో లేడీ దర్శకురాలు నందిని రెడ్డి పేరు ఉండటం విశేషం. ఈ లిస్టులో వారు మొదటగా ఓటమి ఎరుగని దర్శక ధీరుడు బాక్సాఫీస్ బాహుబలి రాజమౌళి పేరు ప్రస్తావించారు. ఈగ, భాహుబలి చిత్రాల ద్వారా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. ఇక ఆయన తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ని వారు పరిగణలోకి తీసుకున్నారు. 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాల ద్వారా ఆయన టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారన్నారు.
ఇక ఈ లిస్టులో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ పేర్లతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ని ప్రస్తావించడం గమనార్హం. ఆమె మొదటి చిత్రం అలా మొదలైంది బ్లాక్ బస్టర్ హిట్ అందుకోకా తదుపరి రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. ఇక తాజాగా ఆమె సమంత ప్రధాన పాత్రలో చేసిన ఓ బేబీ సంచలన విజయం సాధించి ఆమెకు చాలా కాలం తరువాత మంచి హిట్ అందించింది. స్టార్ దర్శకుల జాబితాలో నందిని రెడ్డి చోటు సంపాదించి రికార్డ్ సృష్టించింది.
