సూపర్ హిట్ హర్రర్ సినిమా సీక్వెల్ లో నందిత శ్వేత !

2013లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న హర్రర్ కామెడీ ‘ప్రేమ కథా చిత్రం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించనున్నారు. ఇందులో కన్నడ నటి నందిత శ్వేత కథానాయకిగా నటించనుంది.

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నందిత శ్వేత. ఆ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులు, విమర్శకును బాగా ఇంప్రెస్ చేసింది. అందుకే ఆమెను ఎంచుకునాన్రు చిత్ర నిర్మాతలు. ‘ప్రేమ కథా చిత్రం’ సీక్వెల్ యొక్క కథ, అందులో తన పాత్రను విన్న నందిత అవి నచ్చి సినిమాకు ఓకే చెప్పారట. హరి కిషన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంలో సిద్ది ఇద్నాని మరొక కథానాయికగా నటించనుంది.