హవీష్ సరసన ‘ప్రేమకధా చిత్రమ్’ నందిత..!

హవీష్ సరసన ‘ప్రేమకధా చిత్రమ్’ నందిత..!

Published on Jul 27, 2014 12:27 PM IST

Nanditha

‘ప్రేమకధా చిత్రమ్’ సినిమాతో ఇటు విమర్శకులను అటు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ ‘నందిత’. ‘జీనియస్’ సినిమా హీరో హావీష్ కొత్త సినిమాలో హీరోయిన్ అవకాశం సొంతం చేసుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆగస్ట్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ మలేషియాలో ప్లాన్ చేశారు. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్లో ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. అని హీరో తెలిపారు.

టాప్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.

తాజా వార్తలు