పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి అనేది గతం !

Published on Mar 1, 2021 12:01 am IST

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది సక్సెస్ టూర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ సందర్భంగా హీరో నాని ట్వీట్ చేశారు.

నాని ట్వీట్ చేస్తూ.. ”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘అల్లరి నరేష్‌’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను..” అని నాని పోస్ట్ చేశాడు. మొత్తానికి నాని ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :