నాని – సుదీర్ బాబు సినిమా ‘వ్యూహం’ కాదట !

Published on Apr 21, 2019 8:34 pm IST

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన తరువాత సినిమాను నాని, సుదీర్ బాబు ప్రధాన పాత్రల్లో చేయనున్న విషయం తెలిసందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ టైటిలే ఫిక్స్ అయినట్టు హడావుడి కూడా జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ ‘వ్యూహం’ కాదట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓ అచ్చ తెలుగు టైటిల్ నే ఇంద్రగంటి ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో ఇంద్రగంటి టైటిల్స్ చూసుకున్న ‘సమ్మోహనం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తరువాత’ లాంటి పేర్ల శైలిలోనే ఈ టైటిల్ ఉంటుందట. ఇక ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా థ్రిల్లర్‌ అంశాలతో సాగుతుందని.. సినిమాలోని నానికి సుధీర్ బాబుకు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని సమాచారం.

సంబంధిత సమాచారం :