థ్రిల్లింగ్ “హిట్” కు సీక్వెల్ ను కొత్తగా ప్లాన్ చేసిన నాని.!

Published on Feb 28, 2021 11:55 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి అంతే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగానే కాకుండా ఓ నిర్మాతగా కూడా తెలుగు ఆడియెన్స్ కు మంచి సబ్జెక్టులు కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ నుంచి గత సంవత్సరం యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు విశ్వక్ సేన్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన “హిట్” చిత్రాన్ని విడుదల చేసారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చి ఇది మంచి విజయాన్ని అందుకుంది. మరి సరిగ్గా ఇది విడుదలైన నేటికి నాని దీని సీక్వెల్ ను ప్రకటించడం విశేషం. అది ఇంట్రెస్టింగ్ గా ఆ అప్డేట్ ను వదిలాడు నాని. గతంలో తెలంగాణ రోల్ విక్రమ్ రుద్ర రాజు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తే ఈసారి ఏపీలో స్టోరీ ఉంటుంది అన్నట్టు తెలిపాడు. అలాగే ఇందులో “కేడీ” అనే రోల్ ను కూడా హైలైట్ చేస్తున్నాడు. మరి ఈసారి ఎవరితో ప్లాన్ చేసారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్ట్ ను కూడా శైలేష్ కొలను హిందీ రీమేక్ చేస్తాడని ఆ మధ్య టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :