నాని లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లను రాబడుతుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ నాని ని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథిగా చూపించిన తీరు ఆకట్టుకుంది. ఇక నాని కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ యాక్టింగ్ తో అలరించాడు. కాగా నాని తన తదుపరి చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వి’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై డీలా రాజు నిర్మిస్తుండగా నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ గా కనిపిస్తాడని సమాచారం.
కాగా ఈ చిత్ర షూటింగ్ కొరకు ఇటీవల థాయిలాండ్ వెళ్లిన చిత్ర బృందం అక్కడ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. థాయిలాండ్ లోని ఫుకెట్ ఐలాండ్ లో హీరో నాని , కమెడియన్ వెన్నెల కిషోర్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తుంది. నాని సరసన నివేదా థామస్, అదితిరావ్ హైదరి నటిస్తుండగా హీరో సుధీర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.
