క్రేజీ ప్రాజెక్టులతో బిజీ కానున్న నాని!

nani
తన సహజమైన నటనతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో నాని. గత కొంతకాలంగా తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే హిట్ కోసం ఎదురుచూసిన నాని, ఈమధ్యే విడుదలైన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాల ద్వారా మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నాని దర్శకుడు మారుతీతో ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమాతో పాటు అందాల రాక్షసి ఫేం హను రాఘవ పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసున్న విషయం తెలిసిందే.

నాని ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల దర్శకులూ రెండు భిన్న ధృవాలలాంటి వారు. ఆ రకంగా నాని రెండు దేనకదే డిఫరెంట్ సినిమాను తీస్తున్నట్టు కనిపిస్తూనే ఉంది. ఈ సినిమాలే కాక మరో క్రేజీ ప్రాజెక్టుకు సైతం నాని సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ షూటింగ్ చివరిదశకు చేరింది. ఆ తర్వాత హనూ రాఘవ పూడి సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ గ్యాప్‌లో మరో కొత్త సినిమా స్క్రిప్ట్ విషయమై నాని సంప్రదింపులు జరిపే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగితే నానికి ఈ సంవత్సరం కచ్చితంగా గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.

Exit mobile version