నాని ఏమైనా స్పెషల్ గురూ…!

Published on Aug 9, 2019 10:54 am IST

టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య స్నేహ భావం చూస్తుంటే వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేం. నిన్న నాని ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో పై సంచలనం ట్వీట్ చేసి వార్తలలో నిలిచారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఆగస్టు 30న విడుదల చేయాలనీ నిర్ణయించుకోవడం జరిగింది. ఐతే అనుకోకుండా సాహో విడుదల తేదీని చిత్ర నిర్మాతలు ఆగస్టు 15నుండి 30కి మార్చిడంతో గ్యాంగ్ లీడర్ మూవీ నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. చివరికి వాళ్లు తమ చిత్ర విడుదల తేదీ మార్చనున్నట్లుగా సంకేతాలు పంపించారు.

కాగా ఈ విషయంపై మొదటి సారి స్పందించిన నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. సాహో చిత్రం మాది, దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాహో చిత్రం అతిపెద్ద విజయం సాధించాలి, ప్రభాస్ అన్నకు,మిగతా చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అని ట్వీట్ చేయడం జరిగింది.తోటి హీరో పట్ల నాని ప్రదర్శించిన స్నేహ భావానికి, అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే నెల 13న విడుదల అయ్యే అవకాశం కలదని సమాచారం.

సంబంధిత సమాచారం :

More