నాని ఆసక్తికర ప్రశ్నకు, సద్గురు అద్భుత సమాధానం.

నాని ఆసక్తికర ప్రశ్నకు, సద్గురు అద్భుత సమాధానం.

Published on Jul 22, 2019 12:00 AM IST

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ తో హీరో నాని ఇన్ కాన్వేర్జేషన్ విత్ మిస్టిక్ కార్యక్రంలో పాల్గొనడం జరిగింది. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గచ్చీబౌలీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రంలో నాని అడిగిన ఓ ఆసక్తికర ప్రశ్నకు, సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుత సమాధానం ఇచ్చి ప్రాపంచిక విషయాలపై ఆయనకున్న గొప్ప జ్ఞానాన్ని తెలియపరిచారు.

నాని ఓ తండ్రిగా పిల్లల్ని ఎలా పెంచాలి అని అడుగగా , “ఒక పులి కడుపున పులి పిల్ల పుట్టిందంటే ఒక పులి పుట్టిందనే అర్థం. తన భవిష్యత్తుకు సంబంధించిన 90 శాతం లక్షణాలు పిల్లగా ఉన్నప్పుడే పులిలో ఉంటాయి. మిగతా 10 శాతం పెంపకం ద్వారా లభిస్తాయి. తిండి తింటే చాలు పులి పిల్ల కాస్తా పులై పోతుంది. కానీ, మనిషి అలా కాదు. ఓ శిశువు పుట్టగానే మనిషికి అవసరమైన 10 శాతం లక్షణాలే ఉంటాయి. మిగతా 90 శాతం పెంపకం ద్వారానే సంక్రమిస్తాయి. ఆ బిడ్డ మనిషి కావడం అనేది తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మకు మాత్రమే ఈ ప్రత్యేకత” అంటూ వివరణ ఇచ్చారు.తన ప్రశ్నకు అద్భుతమైన సమాధానం దొరకడంతో నాని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు