నార్త్ లో కూడా బాగానే రాబట్టిన ‘హిట్ 3’..!

నార్త్ లో కూడా బాగానే రాబట్టిన ‘హిట్ 3’..!

Published on May 7, 2025 3:00 PM IST

లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సాలిడ్ విజయాన్ని అందుకున్న చిత్రం “హిట్ 3”. నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం నాని కెరీర్లోనే భారీ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల అయితే మేజర్ గా తెలుగులో మాత్రమే అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి.

మరి అసలు హిందీ వెర్షన్ పరిస్థితి ఏంటి అనేది ఇపుడు తెలుస్తుంది. హిట్ 3 చిత్రానికి బాలీవుడ్ లో మొత్తం 6 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ మేర వసూళ్లు నార్త్ బెల్ట్ లో నమోదు అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో హిందీలో కూడా హిట్ 3 పర్వాలేదు అనే రేంజ్ లోనే పెర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా హిట్ 3 మంచి బుకింగ్స్ ని కనబరుస్తుంది. ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు