ఆ చిన్న చిత్రం నాని కి నచ్చింది !
Published on Aug 27, 2018 6:00 pm IST

నూతన నటి నటులతో నూతన దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన చిత్రం కేరాఫ్ కంచరపాలెం. చాలా రియాలిస్టిక్ గా తెరకెక్కిన ఈచిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన నాని ఈ సినిమాపై ప్రశంశలు కురిపించారు. ఈచిత్రం నన్ను నవ్వించింది అలాగే ఏడిపించింది. చాలా కాలం తరువాత ఇలాంటి ఒక మంచి సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది . మీరుకూడా ఈసినిమాని మిస్ కాకండి అని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఇంతకుముందు రాజమౌళి, సుకుమార్ ఈచిత్రాన్ని చూసి తమ అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. పరుచూరి విజయ ప్రవీణ నిర్మించిన ఈచిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకులముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook