నాని ‘జెర్సీ’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

నాని ‘జెర్సీ’ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 23, 2018 3:00 AM IST

‘మళ్ళీ రావా’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో నాని సరసన కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది.

కాగా, ఈ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందని.. సీన్స్ అనుకున్న సమయానికి కంటే ముందే పూర్తి అవుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నిర్మాత సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు