నాన్ స్టాప్ షూటింగ్ లో నాని ‘ జెర్సీ ‘ !

నాన్ స్టాప్ షూటింగ్ లో నాని ‘ జెర్సీ ‘ !

Published on Nov 21, 2018 1:31 AM IST

‘దేవదాస్’ చిత్రం తరువాత న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నిన్నటినుండి రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసుకుంది.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. నాని మొదటి సారి డిఫ్రెంట్ జోనర్ లో నటిస్తుడడం తో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు