మాస్ యాంగిల్ చూపించిన టక్ జగదీష్…!

మాస్ యాంగిల్ చూపించిన టక్ జగదీష్…!

Published on Feb 20, 2021 11:46 PM IST


నాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం టక్ జగదీష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం కాగా భారీ అంచనాలున్నాయి. ఇక దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీ చిత్రాల విజయాలతో మంచి జోరులో ఉన్నారు. ఆయనకు టక్ జగదీష్ మూడవ చిత్రం. కాగా ఈ మూవీ నుండి నేడు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

చేతిలో గడ్డ పలుగుతో సీరియస్ గా ముందుకు వెళుతున్న నాని లుక్ చాలా ఫెరోషియస్ గా ఉంది. రాయలసీమ నేపథ్యంలో టక్ జగదీశ్ కథ నడుస్తుందని వార్తలు వస్తుండగా… యాక్షన్ పాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండే సూచనలు కలవు. ఇక ఫిబ్రవరి 23న టక్ జగదీష్ టీజర్ విడుదల కానుందని మోషన్ పోస్టర్ లో తెలియజేశారు.

షైన్ స్రీన్స్ పతాకంపై తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో విశేషం. మొత్తంగా టక్ జగదీష్ మోషన్ పోస్టర్ ఆకట్టుకోగా… టీజర్, ట్రైలర్స్ పై అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు