‘జెర్సీ’ తో రానున్న నాని !

‘జెర్సీ’ తో రానున్న నాని !

Published on Jun 15, 2018 2:05 PM IST

nani1

న్యాచురల్ స్టార్ నాని ‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ తెరకేకించే సినిమాలో నటించనున్నాడు అని తెలిసిందే . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ చిత్రం.

ఇక నాని ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నటించనున్నాడు .తాజాగా విడుదలైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది . ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు . ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు అయన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు