టాలీవుడ్ వద్ద తమ స్వశక్తితో మంచి స్టార్డం సొంతం చేసుకున్న హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఇలా నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఇప్పుడు 18 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో అభిమానులు కూడా ఈ స్పెషల్ డే ని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తన సినిమా కెరీర్ లో పూర్తి చేసుకున్న ఈ పద్దెనిమిదేళ్ల సినీ ప్రయాణంపై నాని కూడా స్పందించాడు.
ఈ 18 ఏళ్ళు పూర్తి కావడంతో తను సినిమాల్లో పెద్దోన్ని అయ్యాను అంటే 18 ఏళ్ళు దాటితే అడల్ట్స్ అంటారుగా.. అలా టాలీవుడ్ లో మారినట్లు తెలిపాడు. అంతే కాకుండా ఈ జర్నీ విషయంలో ఫ్యాన్స్ కి కూడా తాను ప్రామిస్ ఇచ్చాడు. మీ ప్రేమను నేనెప్పుడూ అలుసుగా తీసుకోలేదు, తీసుకోను కూడా అంటూ.. తన అభిమానులకు ఒక బ్యూటిఫుల్ ప్రామిస్ ని చేశాడు. పైగా దీనికి తన కొత్త సినిమా ప్యారడైజ్ నుంచి ఓ క్లిప్ తో షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.
18 years.
Officially an adult in cinema 🙂Never took your love for granted. I won’t ever. ♥️ pic.twitter.com/s6lcXTSs1Y
— Nani (@NameisNani) September 5, 2026
