కామెడీ వర్కవుట్ అయితే నాని పంట పండినట్టే

కామెడీ వర్కవుట్ అయితే నాని పంట పండినట్టే

Published on Sep 6, 2019 11:21 PM IST

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచ్యురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జెర్సీ’ మంచి సినిమా అనే టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ సక్సెస్స్ అనిపించుకోలేదు. దీంతో ఈసారైనా పర్ఫెక్ట్ హిట్ కొట్టాలని భావిస్తున్న నాని ఆశలన్నీ ‘గ్యాంగ్ లీడర్’ మీదే పెట్టుకున్నాడు.

పైగా ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండటం మరొక కలిసొచ్చే అంశం. ఎందుకంటే నాని కెరీర్లో భారీ విజయాలుగా నిలిచిన సినిమాలు ‘భలే భలే మగాడివోయ్, నేను లోకల్, అష్టా చమ్మా, పిల్ల జమీందార్, క్రిష్ణగాడి వీరప్రేమగాధ’ లాంటి చిత్రాలన్నీ కామెడీ జానర్ సినిమాలే. వాటిలోని కామెడీ కంటెంట్ ప్రేక్షకులకి కనెక్ట్ అవడంతో అవి భారీ హిట్లుగా నిలిచాయి. అలాగే ‘గ్యాంగ్ లీడర్’లోని కామెడీ కూడా బాగా పండితే నాని సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయం.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటించగా ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు