నాన్-స్టాప్ అంటున్న నాని.. ఇకనైనా ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

paradise

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డీటెయిల్డ్ వర్క్ వల్ల ఆలస్యం అవుతుంది. సెట్స్ నిర్మాణం సహా పలు కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు చిన్న విరామం తరువాత, ఈ చిత్రం షూటింగ్‌కు రెడీ అయింది.

డిసెంబర్ 4 నుంచి మళ్లీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు వృథా అయిన సమయాన్ని పూడ్చుకునేందుకు నాని, శ్రీకాంత్ ఇద్దరూ నాన్-స్టాప్‌గా షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాని డిసెంబర్ మొత్తం హైదరాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. మార్చి కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని నాని ప్లాన్ చేస్తున్నారు.

అయితే, అనుకోకుండా ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ మార్చ్‌కు కాకుండా మే లేదా జూన్‌కు మారే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మోహన్ బాబు, రాఘవ జుయాల్ విలన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version