ఒకరోజు ముందే నాని ఆమూవీకి రేటింగ్ ఇచ్చేసారు.

Published on Jun 28, 2019 9:30 am IST

నాచురల్ స్టార్ నాని నేడు విడుదల కానున్న ఓ చిత్రం అద్బుతంగా ఉందంటూ తన స్పందన తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. శ్రీవిష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నివేదా థామస్,నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా తెరకెక్కిన “బ్రోచేవారెవరురా” మూవీ నేడు విడుదలైంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ మూవీ ఓ కామెడీ క్రైమ్ థ్రిలర్ గా తెరకెక్కించాడని సమాచారం.

ఐతే హీరో నాని నిన్న రాత్రి ట్విట్టర్ వేదికగా మూవీ హిలేరియస్ గా ఉందని ప్రశంసించారు. చిత్రంలో నటించిన నటులందరూ చాలా బాగా చేశారు, డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ పనితనం బాగుందన్నట్టుగా ట్వీట్ చేశారు. నాని లాంటి హీరో ఈ మూవీని పొగుడుతూ ట్వీట్ చేయడమంటే మూవీకి బాగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన మూవీ వసూళ్లు పెరగడానికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

More