నా సినిమా ఆడలేదు బాబాయ్ – నాని

Published on May 26, 2018 10:24 am IST

హీరో నాని అంటే పరిశ్రమలోని వ్యక్తులకు, ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకు కారణం ఆయన నిజాయితీయే అనాలి. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ కొనసాగించే హీరోల్లో ఆయన కూడ ఒకరు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్లందుకున్న నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.

నాని నటనకు ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా చిత్రం అంతగా ఆడలేదు. ఈ విషయాన్ని నాని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక ఆన్ లైన్ టీవీ ఛానెల్ ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని సూపర్ హిట్ అంటూ ప్రస్తావించగా నాని అందుకు బదులిస్తూ ‘సూపర్ హిట్ అంట, అవ్వలేదు బాబాయ్. ఆడలేదు కూడ. అయినా మనసు పెట్టి చేశాం చూసేయండి’ అంటూ సరదాగా సంధానం ఇచ్చి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కాళీ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :