నాని ఏమైనా డిఫరెంట్ గురూ…!

నాని ఏమైనా డిఫరెంట్ గురూ…!

Published on Jul 21, 2019 6:35 PM IST

నాని నటించిన తాజా చిత్రం “జెర్సీ”. ఎమోషనల్ స్పోర్ట్స్ గా వచ్చిన ఈ మూవీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడంతో పాటు,వసూళ్ల పరంగా కూడా పర్వాలేదనిపించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ తన్ననురి దర్శకత్వం వహించగా, శ్రద్దా శ్రీనాధ్ నాని సరసన నటించడం జరిగింది.

కాగా నేడు ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం కానుంది. జీ తెలుగు ఛానల్ లో జెర్సీ మూవీ 5:30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఐతే నాని ఈ సందర్బంగా ఓ ట్వీట్ చేశారు. ఈరోజు “జెర్సీ” మూవీ టెలివిషన్ లో ప్రసారం కానుంది, మేమందరం మరో మారు మీ అభిమానాన్ని పొందబోతున్నాం, దయచేసి తీరిక చేసుకొని చూడండి అని ట్వీట్ చేశారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒకసారి మూవీ థియేటర్లలో నుండి వెళ్లిపోయిందంటే దానిని పట్టించుకోవడమే మానేస్తారు. అలాంటిది నాని టీవీ లో ప్రసారం అయ్యే సమయంలో కూడా తను నటించిన చిత్రానికి ప్రచారం కల్పిస్తూ సాటిలైట్ రైట్స్ కొన్నసదరు ఛానెల్ కి మేలుచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు