బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ సలహాలు తీసుకున్నాను – నాని !
Published on Jun 4, 2018 6:37 pm IST

బిగ్ బాస్ సెకండ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడింది . ఈ షోకి నానిహోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . తాజాగా జరిగిన ఈ షో ప్రెస్ మీట్ లో నాని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.అసలు ఇంతవరకు బిగ్ బాస్ షో చూడలేదని మా ఇంట్లో ఎవరైనా ఈ షో చూస్తుంటే తిట్టేవాడినని అలాంటిది నేనే ఇప్పుడు ఈ షో కి హోస్ట్ చేస్తున్నాని అన్నారు. అలాగే ఇటీవల ఎన్టీఆర్ ని ఒక పార్టీలో కలిసినప్పుడు ఈసెకండ్ సీజన్ కోసం కొన్ని సలహాలు ఇచ్చాడని అవి చాలా ఉపయోగపడుతున్నాయని నాని వ్యాఖ్యానించారు.

ఇక ఈ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా అది సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే . ఇప్పుడు అందరి చూపులు నాని ఫైనే ఉన్నాయి . మరి నాని కూడా ఎన్టీఆర్ ల ఆకట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఈ నెల 10వరకు ఆగాల్సిందే .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook